Thu Mar 19 2026 14:02:17 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : కొ డాలి, వంశీని చంపితే యాభై లక్షల రివార్డు
ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మధిర మున్సిపల్ ఛైర్మన్ మల్లాది వాసు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మధిర మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసు సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరిని భౌతికంగా దూరం చేస్తే యాభై లక్షలు బహుమతిగా ఇస్తానని ఆయన ప్రకటించారు. కమ్మ వనసమారాధనలో జరిగిన కార్యక్రమంలో మల్లాది వాసు ఈ వ్యాఖ్యలు చేశారు. మధిర మున్సిపల్ కౌన్సిలర్ గా మల్లాది వాసు ఉన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో వనసమారాధనలో ఒక్కసారి కలకలం రేగింది.
కమ్మకులంలో చెడబుట్టి....aa
గతంలో కమ్మ వారికి పరిటాల రవి అండగా ఉండేవాని మల్లాది వాసు అన్నారు. కానీ పరిటాల రవిని మొద్దు శ్రీనుతో చంపించేశారని చెప్పారు. పరిటాల రవి బతికుంటే ఆంధ్రలో ఇప్పుుడు ఈ పరిస్థితి ఉండేది కాదని మల్లాది వాసు అన్నారు. కమ్మ వారికి అండగా ఉండేవారిని అణిచివేస్తున్నారన్నారు. కమ్మ కులంలో కొడాలి నాని, వల్లభనేని వంశం చెడపుట్టారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Next Story

