Sun Mar 15 2026 12:29:22 GMT+0530 (India Standard Time)
గుంటూరు జైలుకు గల్లా
గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ ను గుంటూరు జైలుకు పోలీసులు తరలించారు. ఆయన నిన్న అమరావతి ప్రాంతంలో నిషేధాజ్ఞలను ఉల్లంఘించారని గల్లా జయదేవ్ పై పోలీసులు [more]
గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ ను గుంటూరు జైలుకు పోలీసులు తరలించారు. ఆయన నిన్న అమరావతి ప్రాంతంలో నిషేధాజ్ఞలను ఉల్లంఘించారని గల్లా జయదేవ్ పై పోలీసులు [more]

గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ ను గుంటూరు జైలుకు పోలీసులు తరలించారు. ఆయన నిన్న అమరావతి ప్రాంతంలో నిషేధాజ్ఞలను ఉల్లంఘించారని గల్లా జయదేవ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న అర్థరాత్రి పోలీసులు గల్లా జయదేవ్ ను అరెస్ట్ చేశారు. ఆయనను న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టడంతో రిమాండ్ విధించారు. దీంతో గల్లా జయదేవ్ ను గుంటూరు సబ్ జైలుకు తరలించారు. గల్లా జయదేవ్ ను విడుదల చేయాలని కోరుతూ సబ్ జైలు వద్ద ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story