Thu Mar 26 2026 15:32:53 GMT+0530 (India Standard Time)
ఎన్నికల వేళ మోత్కుపల్లికి.....?

సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన నిన్న రాత్రి వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. ఛాతీనొప్పి కూడా రావడంతో ఆయనను మొదట భువనగిరి ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ ప్రయివేటు ఆసుపత్రికి మోత్కుపల్లిని తరలించారు. మోత్కుపల్లి నరసింహులు ఆలేరు నియోజకవర్గం నుంచి బీఎల్ఎఫ్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. పోలింగ్ జరిగే సమయంలోనే ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story

