Mon Feb 02 2026 17:23:34 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: ఊహించని పార్టీలోకి మోత్కుపల్లి

తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన గురువారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. మోత్కుపల్లిని జనసేన పార్టీ తెలంగాణ శాఖకు అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా కొనసాగిన మోత్కుపల్లి మంత్రిగా కూడా పనిచేశారు. నల్గొండ జిల్లా ఆలేరు, ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిత్యం వహించారు. ఆయన ఇటీవల టీడీపీపై, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆయనను పార్టీని నుంచి బహిష్కరించారు. ఆంధ్రలో టీడీపీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తా అంటున్న ఆయన ఇటీవల తిరుమలకు కాలినడకన కూడా వెళ్లారు.
Next Story

