Sat Aug 13 2022 05:46:17 GMT+0000 (Coordinated Universal Time)
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు..వారంరోజుల్లో తెలుగు రాష్ట్రాలకు !

హైదరాబాద్ : ప్రతి ఏటా జూన్ మొదటివారానికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకడం మామూలే. కానీ.. ఈసారి కాస్త ముందుగానే మే ఆఖరి వారానికే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. అనుకూల పరిస్థితుల నేపథ్యంలో మూడ్రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు ఎంటరయ్యాయి. నేడు కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.
ఇటీవలే బంగాళాఖాతంలో అసని తుఫాను సంభవించిన విషయం తెలిసిందే. అప్పుడే నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే కేరళను తాకుతాయని ఐఎండీ అంచనా వేసింది. మే 27 నాటికే నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయన్న అంచనాలుండగా.. రెండ్రోజులు ఆలస్యంగా వచ్చాయి. నైరుతి ఆగమనంతో దేశంలో వేసవి తాపం నుంచి ప్రజలకు ఉపశమనం కలగనుంది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 40 నుంచి 47 డిగ్రీల వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నేడు కూడా తెలుగు రాష్ట్రాల్లో వేడిగాలులతో పాటు.. ఎండ తీవ్రత అధికంగానే ఉంది. వచ్చేవారం రోజుల వరకూ నైరుతి రుతుపవనాలు తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ వరకు విస్తరించే అవకాశాలు లేవని, ఆయా రాష్ట్రాల్లో 'నైరుతి' ప్రభావం కనిపించడానికి కొంత సమయం పడుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థ 'స్కైమెట్' పేర్కొంది.
Next Story