మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ మోడీ

ఇండియా లో అత్యంత ప్రభావవంతమైన వారి జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడాది నెంబర్ వన్ లో నిలిచారు. మోస్ట్ పవర్ ఫుల్ ఇండియాన్స్ జాబితాను ఒక ప్రయివేటు మీడియా సంస్థ ప్రతి ఏటా ప్రకటిస్తుంది. ఈ ఏడాది కూడా ఆ సంస్థ ప్రకటించిన జాబితాలో మోడీ టాప్ ర్యాంక్ అందుకున్నారు. ఇక టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్ 20 కి వచ్చేశాడు. గత ఏడాది కన్నా విరాట్ తన ర్యాంక్ ను మెరుగుపరుచుకున్నాడు. కోహ్లీ తన వ్యక్తిగత ఇమేజ్, భారత్ కి అందిస్తున్న అపూర్వ విజయాలు, జట్టు పట్లా తన ఆట పట్ల చూపించే అంకిత భావంతో తన ర్యాంక్ లో దూసుకువచ్చాడు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న విరాట్ కి ఇండియా లో క్రికెట్ అభిమానులు నీరాజనాలు పలుకుతారు.
లిస్ట్ లో లేని టాప్ సెలబ్రిటీలు ...
ఇక బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కోచ్ పుల్లెల గోపీచంద్ 91 వ స్థానంలో నిలవడం విశేషం. కోహ్లీ స్థాయి కన్నా క్రికెట్ దేవుడు గా పిలుచుకునే సచిన్ కి జాబితాలో చోటే దక్కలేదు. రాహుల్ ద్రావిడ్, ఎం ఎస్ ధోని లు సచిన్ బాటలోనే ఈ లిస్ట్ లో స్థానం దక్కించుకోలేక పోయారు. వాస్తవానికి భారత క్రికెట్ చరిత్రలో ఎందరో టాప్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ప్రతి ఏటా ఆ సంవత్సరం చూపించే ప్రతిభ ఆధారంగా దేశ వాసులను ప్రభావితం చేసే వారి జాబితా రూపొందిస్తారు. దాంతో సచిన్, ద్రావిడ్, ధోని వంటివారికి స్థానం దక్కలేదన్నది నిర్వాహకుల వివరణ. ఏ ఏటికాయేడాది తమ తమ రంగాల్లో మెరుగ్గా ఉంటేనే మోస్ట్ పవర్ ఫుల్ అవుతారు లేకపోతే లిస్ట్ లో నిల్ అవుతారన్నమాట.
