Sun Mar 22 2026 15:28:45 GMT+0530 (India Standard Time)
వారిద్దరిదీ ఫెవికాల్ బంధం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ అంతర్గతంగా కుమ్మక్కయ్యారని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. వారిద్దరిదీ ఫెవీకాల్ బంధమని ఎద్దేవా చేశారు. బీజేపీకి తెలంగాణలో అభ్యర్థులు కూడా దొరకరని, ఆ పార్టీకి 100 స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కవన్నారు. తెలంగాణలో బీజేపీ తరపున పోటీచేయాల్సిన అభ్యర్థుల లిస్టును కూడా కేసీఆర్ తయారుచేసి అమిత్ షాకు ఇచ్చారని ఆరోపించారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ముగ్గురూ ఒకటేనని ఆయన పేర్కొన్నారు. విభజన హామీలు అమలు చేయకున్నా, తెలంగాణకు చెందిన ఏడు ముంపు మండలాలను ఏపీలో కలిపినా ముఖ్యమంత్రి నోరు మూసుకుని ఉన్నారని ఆయన అన్నారు.
Next Story

