Mon Dec 08 2025 12:18:49 GMT+0000 (Coordinated Universal Time)
శభాష్.. సంజయ్.. భుజంతట్టిన మోదీ
భారీ జనసమీకరణతో పాటు ఏర్పాట్లు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను భుజం తట్టి నరేంద్ర మోదీ అభినందించారు

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడకు వచ్చిన జనసందోహాన్ని చూసి మురిసిపోయారు. ఆనందం వ్యక్తం చేశారు. భారీ జనసమీకరణతో పాటు ఏర్పాట్లు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను భుజం తట్టి నరేంద్ర మోదీ అభినందించారు. కీప్ ఇట్ అప్ అంటూ ఆయన సంజయ్ భుజం తట్టి ప్రోత్సహించడం చూసిన సంజయ్ అభిమానులు ఆనందోత్సహాలతో గెంతులేశారు.
ఏర్పాట్లకు ..
బీజేపీ సభకు భారీ జనసమీకరణ చేయడంతో పాటు జాతీయ కార్యవర్గ సమావేశాలను కూడా రాష్ట్ర బీజేపీ చక్కగా నిర్వహించింది. వచ్చిన అతిథులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నందుకు తెలంగాణ నేతలను బీజేపీ అగ్రనేతలు ప్రశంసించారు. వచ్చిన అతిథులకు వసతితో పాటు తెలంగాణ వంటకాలను బీజేపీ ప్రతనిధులకు రుచి చూపించిన బీజేపీ నేతలకు ప్రత్యేకంగా ప్రశంసలు అందచేశారు.
Next Story

