Fri Dec 05 2025 22:32:08 GMT+0000 (Coordinated Universal Time)
రాజీనామా... పార్టీ మారడంపై రోజా సంచలన ప్రకటన
ఎమ్మెల్యే రోజా రాజీనామా చేస్తానని తెలిపారు. నగరి నియోజకవర్గంలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలపై ఆమె స్పందించారు

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా రాజీనామాపై జరుగుతన్న ప్రచారంపై స్పష్టత ఇచ్చారు. నగరి నియోజకవర్గంలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలపై ఆమె స్పందించారు. తాను ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని చెప్పారు. అయినా అవన్నీ దిగమింగుకుని జగనన్న కోసం పార్టీలోనే కొనసాగుతున్నానని రోజా చెప్పారు. తాను పార్టీ మారతానని ప్రచారం జరుగుతుందని, అయతే తాను పార్టీ మారనని, అవసరమైతే రాజీనామా మాత్రం చేస్తానని రోజా తెలిపారు.
పార్టీని వీడాల్సిన.....
పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని రోజా తెలిపారు. తప్పు చేసిన వాళ్లే పార్టీని వీడతారని రోజా అభిప్రాయపడ్డారు. జగనన్నను ప్రేమించే తాను పార్టీ మారాల్సిన పని లేదన్నారు. జగనన్న పార్టీ పెట్టక ముందు నుంచి తాను ఉన్నానని రోజా గుర్తు చేశారు. ఆడబిడ్డగా ఈగడ్డపై చస్తానని, ఇక్కడే ఉండి పోరాటం చేస్తానని రోజా తెలిపారు. అందరూ పల్లె నుంచి వెళ్లి పట్నంలో ఇల్లు కట్టుకుంటుంటే తాను నగరిలో ఇల్లు కట్టుకున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. తాను ఎన్నో పోరాటాలు చేసిన విషయాన్ని రోజా ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Next Story

