Thu Mar 19 2026 01:44:08 GMT+0530 (India Standard Time)
ఎమ్మెల్యే రాజీనామా...సంచలనమే

బీజేపీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన పదవికి రాజీనామా చేశారు. గోరక్షణ కోసం దేనికైనా సిద్దమని ఈ సందర్భంగా రాజాసింగ్ తెలిపారు. తాను గోరక్షణ కోసం ఎలాంటి పదవినైనా వదులుకుంటానని చెబుతున్నారు. అయితే తన ఉద్యమానికి, పార్టీకి సంబంధం లేదని రాజాసింగ్ తెలిపారు. కాని రాజాసింగ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ రూపొందించిన లేఖను పార్టీ అధ్యక్షుడికి ఇవ్వడం విశేషం. పార్టీకి తన ఉద్యమం వల్ల నష్టం జరగకూడదనే తన పదవికి రాజీనామా చేశానని ఆయన తెలిపారు.
Next Story

