ఎమ్మెల్యే కు తృటిలో తప్పిన ప్రమాదం
మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే కారు రోడ్డు ప్రమాదం కు గురైంది. ఈ సంఘటనలో ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలు అయ్యాయి. వారిని స్వయంగా ఎమ్మెల్యే తన వాహనంలో హాస్పిటల్ [more]
మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే కారు రోడ్డు ప్రమాదం కు గురైంది. ఈ సంఘటనలో ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలు అయ్యాయి. వారిని స్వయంగా ఎమ్మెల్యే తన వాహనంలో హాస్పిటల్ [more]
మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే కారు రోడ్డు ప్రమాదం కు గురైంది. ఈ సంఘటనలో ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలు అయ్యాయి. వారిని స్వయంగా ఎమ్మెల్యే తన వాహనంలో హాస్పిటల్ కి తరలించారు. మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండలం లో లాక్ డౌన్ ఈ పరిస్థితుల్లో నిరుపేదలు పడుతున్న బాధలను చూసి ఎమ్మెల్యే హరిప్రియ పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరిగి మరో గ్రామానికి వెళ్తుండగా మిర్యాలపెంట వద్ద ఒక కారు అతివేగంతో వచ్చి ముందు వెళ్తున్న పోలీసు వాహనాన్ని ఢీకొట్టింది. వెనువెంటనే ఆ కారు ఎమ్మెల్యే హరిప్రియ వాహనానికి సమీపానికి దూసుకొచ్చింది. సమయస్ఫూర్తితో ఎమ్మెల్యే డ్రైవర్ వ్యవహరించడంతో ఎమ్మెల్యే హరిప్రియ క్షేమంగా ఉన్నారు. కానీ ఈ సంఘటనలో సీఐ రమేష్, కానిస్టేబుట్ రామకృష్ణ ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్యే వెంటనే ఆ ఇద్దరిని స్వయంగా తన వాహనంలో ఎక్కించి ఆసుపత్రి కి తరలించారు.