ఎమ్మెల్యే గిడ్డి ఫైటింగ్ చూడండి...

ఆమె ఒక ప్రజాప్రతినిధి.. ఓ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. ప్రజలతో బాధ్యతగా.. హుందాగా మెలాగాల్సిన ఆమె రెచ్చిపోయారు. ఓ మహిళపై దౌర్జన్యానికి దిగారు.. తానొక ప్రజాప్రతినిధినన్న విషయాన్ని మరిచి వ్యవహరించారు.. చేతిలో కర్ర పట్టుకుని.. ఆ మహిళను పక్కకు తోసేస్తూ తాను కిందపడిపోయారు. సదరు మహిళ సంబంధీకులను తీవ్రస్థాయిలో బెదిరించారు.. అయితే ఈ తతంగాన్ని అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ఓ మహిళా ప్రజాప్రతినిధి ఇలా ప్రవర్తించడమేమిటనీ.. ఇదెక్కడి సంస్కృతి అంటూ అందరూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇదే సమయంలో ఆమె గతంలోనూ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసుకుంటున్నారు.
సొంత వదినతోనే...
ఆ మహిళా ప్రజాప్రతినిధి మరెవరో కాదు.. పార్టీ ఫిరాయించిన విశాఖపట్నం జిల్లా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. ఈ వీడియోలో ఈశ్వరి ఓ మహిళతో గొడవ పడుతూ కింద పడిపోయారు. లేచిన అనంతరం సదరు మహిళతో.. నువ్వు నన్ను కొట్టకు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో.. అంటూ ఆమెను తోసేసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న ఆ మహిళ మాత్రం ఎమ్మెల్యేను ఏమీ అనకపోవడం, గిడ్డి ఈశ్వరి ఆమెను బలవంతంగా తోసేయడం గమనార్హం. ఇక్కడ మరో విషయం ఉంది.. ఈశ్వరి గొడవ పడిన మహిళ తన సొంత వదిన అని, అన్న కుటుంబం భూమిని కబ్జా చేసేందుకు నడి రోడ్డు మీద దౌర్జన్యానికి దిగిందని స్థానికులు ఆరోపించడం గమనార్హం. అధికారం ఉందన్న అహంకారంతో సోదరుడి పిల్లలను కూడా బలవంతంగా అక్కడి నుంచి గెంటివేసినట్లు తెలుస్తోంది.
[embed]https://youtu.be/LJeeMSc5Dog[/embed]
గత కొన్నిరోజులుగా భూవివాదం
వీరిని వారించడానికి వచ్చిన వ్యక్తిపై కూడా ఎమ్మెల్యే ఈశ్వరి మండిపడ్డారు. 'రాజకీయాలు చేస్తే పాతేస్తా. ఇది నీకు సంబంధం లేని విషయం నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో, నువ్వే చేశావ్ వెధవ రాజకీయాలు అన్నీ' అంటూ బెదిరించారు. అయితే వీరిద్దరి మధ్య గత కొద్ది కాలంగా భూవివాదం నడుస్తోందని స్థానికులు చెబుతున్నారు. అయితే, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయలేదని, పోలీసులు ఆమెకు వంత పాడుతున్నారని స్థానికులు అనడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే, గతంలోనూ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. బాక్సైట్ తవ్వకాలు చేపడితే తల తీసేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యల చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది నెలలకే ఆమె టీడీపీలో చేరడం గమనార్హం.

