Tue Mar 24 2026 07:30:54 GMT+0530 (India Standard Time)
బాబు ముందు జగన్ ఎంత?

చంద్రబాబు ముందు జగన్ ఎంత అని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన్ను ఏమీ చేయలేకపోయారని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబు ఎవరి ఉచ్చులో పడరన్నారు. చంద్రబాబుకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసని గంటా అభిప్రాయపడ్డారు. పట్టిసీమను గతంలో మెచ్చుకున్న బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఈరోజు విమర్శలు ఎందుకు చేయాల్సి వస్తుందని ప్రశ్నించారు. పట్టిసీమ, పోలవరంపై సీబీఐ విచారణ జరుగుతుందని చెబుతున్నారని, తాము ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని గంటా తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని చెప్పారు.
Next Story

