Thu Mar 19 2026 05:25:13 GMT+0530 (India Standard Time)
వచ్చే ఏడాది నుంచి విశాఖలో పరిపాలన
వచ్చే ఏడాది విశాఖ నుంచి పరిపాలన మొదలవుతుందని మంత్రి అమరనాథ్ అన్నారు.

వచ్చే ఏడాది విశాఖ నుంచి పరిపాలన మొదలవుతుందని మంత్రి అమరనాథ్ అన్నారు. విశాఖ రాజధాని కోసం ఎలాంట ి ప్రయివేటు భూమి తీసుకోవడం లేదని ఆయన చెప్పారు. బీచ్ ఐటీ కాన్సెప్ట్ తోనే విశాఖను అభివృద్ధి చేయనున్నామని మంత్రి అమరనాథ్ తెలిపారు. 2023 ఫిబ్రవరిలో విశాఖలో పెట్టుబడుల సదస్సును నిర్వహించనునున్నట్లు మంత్రి వెల్లడించారు.
సెంటు భూమి కూడా...
విశాఖపట్నంలో భూ అక్రమాల ఆరోపణలను ఎవరైనా నిరూపించాలని మంత్రి అమరనాథ్ సవాల్ విసిరారు. అమరావతిలో జరిగిన ఇన్సైడ్ ట్రేడింగ్ కు, విశాఖలో జరిగిన భూ విక్రయాలకు మధ్య పోలికేంటి అని ఆయన ప్రశ్నించారు. రైతుల మహాపాదయాత్ర విశాఖ జిల్లాలో జరుగుతున్నప్పుడు అందుకు ఏం జరిగినా చంద్రబాబుదే బాధ్యత అని ఆయన అన్నారు.
Next Story

