Sun Apr 20 2025 19:16:05 GMT+0000 (Coordinated Universal Time)
Weather Update : మరో మూడు రోజులు వర్షాలు తప్పవు...వాతావరణ శాఖ అలెర్ట్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. ఏపీలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలుపడతాయని చెప్పింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని కూడా పేర్కొంది. ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడతాయని, రైతులు, పశువుల కాపర్లు చెట్ల కింద ఉండకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అలెర్ట్ జారీచేసింది. ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో...
అలాగే గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. ఒడిశా తీర ప్రాంతం వరకూ ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రైతులు తమ పంట ఉత్పత్తులను కాపాడుకోవాలని సూచించింది. అలాగే ఈదురుగాలులు వీచే సమయంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ చెప్పింది.
రాబోయే మూడు రోజులు...
తెలంగాణలోనూ రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిజిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీచేసింది. ఈరోజు నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, మల్కాజ్ గిరి,హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి,సిద్ధిపేట్, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్,సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జారీ చేసింది.
Next Story