Fri May 23 2025 01:11:02 GMT+0000 (Coordinated Universal Time)
Weather Report : వర్షం లేదు.. పాడులేదు.. ఎండలు మాత్రం వాయించేస్తున్నాయ్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. వాయువ్య రాజస్థాన్ మీదుగా ఉపరితల ఆవర్తనం తూర్పు రాజస్థాన్, మహధ్య మహారాష్ట్ర,కర్ణాటక, తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ద్రోణి బలహీనపడినా రాగల రెండు రోజుల్లో వర్షాలు పడతాయని, ప్రజలకు చల్లటి కబురును అందించింది వాతావరణ శాఖ తెలిపింది.
ఉష్ణోగ్రతలు కూడా...
ఈరోజు ఉత్తర కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది. ఉరుములతో కూడిన వర్షంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని కూడా పేర్కొంది. అయితే పగటి ఉష్ణోగ్రతలు మాత్రం గణనీయంగా ఏపీలో పెరుగుతాయని కూడా చెప్పింది. నలభై రెండు నుంచి నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే కనీసం రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింి.
నేడు, రేపు కూడా...
తెలంగాణ రాష్ట్రంలోనూ మరో రెండు రోజులు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరించింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. అయితే ఈరోజు నాగర్ కర్నూలు, సిద్ధిపేట్, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట్, నల్లగొండ, ఖమ్మం, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, ఖమ్మం, మంచిర్యాల, కుమ్రభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు పగటి పూట గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని, పగటి పూట బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
Next Story