Tue Mar 24 2026 12:01:09 GMT+0530 (India Standard Time)
వైసీపీ దీక్షలో మేకపాటికి తీవ్ర అస్వస్థత

ప్రత్యేకహోదా కోసం ఢిల్లీలో దీక్షకు దిగిన ఐదుగురు పార్లమెంటు సభ్యుల్లో ఒకరు అస్వస్థతకు గురయ్యారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వైద్యులు పరీక్షించి దీక్షను విరమించాలని కోరారు. నిన్న మధ్యాహ్నం నుంచి వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు ఢిల్లీలోని ఏపీ భవన్ లో దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు తెల్లవారు ఝామున మేకపాటపిప రాజమోహన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మేకపాటికి 75 ఏళ్ల వయస్సు. ఈ వయస్సులో దీక్ష వద్దని వైద్యులు వారించినా ఆయన వినడం లేదు. మేకపాటికి తీవ్రమైన కడుపునొప్పి వచ్చిందని, దీక్ష విరమించడమే మేలని వైద్యులు సూచిస్తున్నారు. మేకపాటి మాత్రం ససేమిరా అంటున్నారు.
Next Story

