Fri Dec 05 2025 18:56:06 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : విచారణకు ఆదేశం….పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు
విశాఖపట్నంలో గ్యాస్ లీక్ సంఘటనపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. దీనిపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. గ్యాస్ లీక్ కారణాలపై విచారణ నివేదిక [more]
విశాఖపట్నంలో గ్యాస్ లీక్ సంఘటనపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. దీనిపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. గ్యాస్ లీక్ కారణాలపై విచారణ నివేదిక [more]

విశాఖపట్నంలో గ్యాస్ లీక్ సంఘటనపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. దీనిపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. గ్యాస్ లీక్ కారణాలపై విచారణ నివేదిక వచ్చిన తర్వాత కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. లాక్ డౌన్ కారణంగా మూతపడిన పరిశ్రమ నిన్ననే ప్రారంభమయిందన్నారు. ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరిశ్రమ యజమాన్యంపై కేసు నమోదు చేశామన్నారు. చుట్టుపక్కల గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయించినట్లు మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు.
Next Story