Mon Dec 15 2025 00:08:59 GMT+0000 (Coordinated Universal Time)
Mekapati : మేకపాటికి అసమ్మతి సెగ
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సొంత పార్టీ నేత తిరగబడ్డారు. తనకు ఎంపీపీ పదవి ఇవ్వలేదని తెలుసుకుని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయగిరి నియోజకవర్గంలోని [more]
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సొంత పార్టీ నేత తిరగబడ్డారు. తనకు ఎంపీపీ పదవి ఇవ్వలేదని తెలుసుకుని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయగిరి నియోజకవర్గంలోని [more]

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సొంత పార్టీ నేత తిరగబడ్డారు. తనకు ఎంపీపీ పదవి ఇవ్వలేదని తెలుసుకుని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలపరిషత్ అధ్యక్షురాలిగా తొలుత వెంకట లక్ష్మమ్మ పేరును ఖరారు చేశారు. దీంతో ఆమె వర్గీయులు ఎమ్మెల్యేకు అనుకూలంగా ఫ్లెక్సీలు కట్టి సంబరాలు చేసుకున్నారు. అయితే రాత్రికి రాత్రే ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి మరో ఎంపీటీసీ సృజన పేరును ఎంపీపీ పదవికి ఖారారు చేశారు. దీంతో వెంకటలక్ష్మమ్మ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నిన్న సంబరాలు చేసుకుని నేడు ఆందోళనకు దిగింది.
Next Story