Mon Mar 16 2026 17:44:32 GMT+0530 (India Standard Time)
నేడు జగన్ తో చిరంజీవి భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నేడు మెగాస్టార్ చిరంజీవి కలవనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నేడు మెగాస్టార్ చిరంజీవి కలవనున్నారు. ఈమేరకు చిరంజీవికి జగన్ అపాయింట్ మెంట్ లభించింది. ఈరోజు నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చిరంజీవిని వెళ్లనున్నారు. చిరంజీవితో సమావేశం కానున్నారు.
మూవీ టిక్కెట్ల.....
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ సినిమారంగానికి చెందిన పెద్దలు ఎవరూ జగన్ ను కలవలేదు. చిరంజీవి కూడా సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు అసంతృప్తి వ్కక్తం చేశారు. జగన్ ను టాలీవుడ్ గుర్తించడం లేదన్న విమర్శలు కూడా ఇటీవల కాలంలో వైసీపీ నేతల నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ను కలిసేందుకు చిరంజీవి నేడు విజయవాడ రానున్నారు.
Next Story

