Thu Feb 13 2025 21:30:19 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ తో చిరంజీవి భేటీ ఎందుకంటే?
మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలవబోతున్నారు. రేపు ఉదయం 11గంటలకు అమరావతిలో జగన్ ను చిరంజీవి కలవనున్నారు. చిరంజీవి తొలిసారి జగన్ తో [more]
మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలవబోతున్నారు. రేపు ఉదయం 11గంటలకు అమరావతిలో జగన్ ను చిరంజీవి కలవనున్నారు. చిరంజీవి తొలిసారి జగన్ తో [more]

మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలవబోతున్నారు. రేపు ఉదయం 11గంటలకు అమరావతిలో జగన్ ను చిరంజీవి కలవనున్నారు. చిరంజీవి తొలిసారి జగన్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. చిరంజీవి రాజకీయాలకు బ్రేక్ ఇచ్చి సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఆయన సోదరుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టి జగన్ కు ఏపీలో ప్రత్యర్థిగా ఉన్నారు. అయితే సైరా నరసింహారెడ్డి సినిమాను చూడాల్సిందిగా చిరంజీవి ఈ సందర్భంగా జగన్ ను కోరనున్నారు. వీరి మధ్య రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశముంది.
Next Story