Tue Mar 24 2026 12:10:20 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఎన్ కౌంటర్..5గురు మావోల మృతి

ఒడిశా రాష్ట్రం మల్కన్ గిరి జిల్లాలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమల హత్యానంతరం ఆంధ్రా ఒడిశా బోర్డర్ లో పోలీసులు కూంబింగ్ చేస్తున్నారు.ఏవోబీలో పోలీసులు కూంబింగ్ చేస్తున్నప్పుడు మావోయిస్టులు తారసపడటంతో పోలీసులు కాల్పులు ప్రారంభించారు. మావోలు కూడా ఎదురుకాల్పులకు దిగారు మల్కాన్ గిరి జిల్లా బెజ్జంగివాడ అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేత రణదేవ్ తృటిలో తప్పించుకున్నట్లు సమాచారం.
Next Story

