Wed Mar 25 2026 09:54:37 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మర్రి సీరియస్ వార్నింగ్

కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలోనూ తనకు సీటు దక్కకపోవడంపై మర్రి శశిధర్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయంటూ ఆయన పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. తనకు నియోజకవర్గంలో కొన్ని కమిట్ మెంట్స్ ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తాను కార్యకర్తలతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. సనత్ నగర్ నియోజకవర్గాన్ని మూడో జాబితాలో కూడా కన్పించకపోవడంపై శశిధర్ రెడ్డి అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సనత్ నగర్ లో కూనం వెంకటేశ్ గౌడ్ పేరును టీడీపీ అధికారికంగా ప్రకటించడం విశేషం.
Next Story

