Mon Mar 23 2026 06:06:25 GMT+0530 (India Standard Time)
ముందస్తు ఎన్నికలపై మావోల లేఖ

ముందస్తు ఎన్నికలు బూటకమని మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ పేర్కొన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. పాలక పార్టీలన్నీ తోడుదొంగలే అని, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలు దోపిడీ వర్గ పార్టీలని ఆయన ఆరోపించారు. తెలంగాణ జన సమితి అవకాశవాద రాజకీయాలను నిరసించాలని పేర్కొన్నారు. కుల వివక్ష, పరువు హత్యలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాజకీయఖైదీలను విడుదల చేయాలని, ధర్నాచౌక్ ను పునరుద్ధరించి ప్రజల ప్రాథమిక హక్కులను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story

