Sat Mar 21 2026 00:41:18 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : మండవ మళ్లీ రెడీ అయ్యారు....!

తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. కొద్దిసేపటి క్రితం మండవ వెంకటేశ్వరరావు హైదరాబాద్ లోని చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ తో జత కడుతున్న వేళ నిజామాబాద్ నుంచి మండవ మళ్లీ పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. దాదాపు కొన్నేళ్లుగా మండవ వెంకటేశ్వరరావు పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ లోకి వెళతారన్న ప్రచారమూ జరిగింది. కాని ఎందుకో ఆయన చేరలేదు. ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధమయిన వేళ మండవ మళ్లీ ఎంట్రీ ఇవ్వడంతో నిజామాబాద్ జిల్లా నుంచి ఆయన టీడీపీ గుర్తు మీద పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లే కన్పిస్తోంది.
- Tags
- bharathiya janatha party
- chief minister
- indian national congress
- k chandrasekhar rao
- mandava venkateswara rao
- telangana
- telangana rashtra samithi
- telugudesam party
- ts politics
- కె. చంద్రశేఖర్ రావు
- టీ.ఎస్. పాలిటిక్స్
- తెలంగాణ
- తెలంగాణ రాష్ట్ర సమితి
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- మండవ వెంకటేశ్వరరావు
- ముఖ్యమంత్రి
Next Story

