Mon Mar 23 2026 00:56:40 GMT+0530 (India Standard Time)
ముఖ్యమంత్రిని చంపేందుకు సుపారీ ?

తనను చంపేందుకు కొన్ని రాజకీయా పార్టీలు ప్రయత్నిస్తున్నాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఓ రాజకీయ పార్టీ తనను హతమార్చేందుకు కిరాయి ముఠాకు సుపారీ కూడా అందజేసినట్లు ఆమె ఆరోపించారు. కలకత్తాలో ఆమె ఓ వార్తా ఛానల్ తో మట్లాడుతూ.. తన హత్యకు ఇప్పటికే కిరాయి ముఠా రెక్కీ కూడా నిర్వహించినట్లు తెలిపారు. దీంతో రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఆమెను ప్రభుత్వ బంగ్లాకు నివాసం మార్చాలని కోరినట్లు చెప్పారు. తాను చావుకు భయపడే వ్యక్తిని కానని స్పష్టం చేశారు. మమత ముఖ్యమంత్రి కాకముందు నుంచీ సాధారణ ఒక అంతస్థు భవనంలోనే నివాసం ఉంటున్నారు..
Next Story

