Mon Feb 02 2026 17:24:21 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీలో వాళ్లు మంచివాళ్లన్న మమతా

భారతీయ పార్టీ పేరు చెప్పినా, ఆ పార్టీ నేతల పేర్లు చెప్పిన ఒంటికాలిపై లేస్తారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అయితే, ఆమె స్వయంగా కొందరు బీజేపీ నేతలు మంచివారని కితాబిచ్చారు. అలూ, అలూచిప్స్ ఒకేలా ఉండవని, బీజేపీలోనూ అందరూ ఒకేలా ఉండరని పేర్కొన్నారు. బీజేపీలో కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్, రాజ్ నాథ్ సింగ్ మంచివాళ్లని ప్రశంసించారు. 2019 ఎన్నికల్లో విపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యంగా పనిచేయాలని మమత భావిస్తున్నారు. ఈ మేరకు ఆమె ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీ సహా విపక్ష నేతలను కలుస్తున్నారు. బీజేపీ కురువృద్ధుడు అద్వానీతోనూ ఆమె పార్లమెంటు ప్రాంగణంలో సమావేశమయ్యారు. అస్సాంలో జరుగుతున్న ఎన్ఆర్సీ రగడపై ఆమె అద్వానీతో చర్చించినట్లు తెలుస్తోంది.
Next Story

