Mon Mar 16 2026 06:27:19 GMT+0530 (India Standard Time)
అమిత్ షా గూండా… మోడీ ఓ సైతాన్
చివరి దశ ఎన్నికల ముందు పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. బెంగాల్ లో హింసకు మమతానే కారణమని [more]
చివరి దశ ఎన్నికల ముందు పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. బెంగాల్ లో హింసకు మమతానే కారణమని [more]

చివరి దశ ఎన్నికల ముందు పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. బెంగాల్ లో హింసకు మమతానే కారణమని నరేంద్ర మోడీ ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే సంఘ సంస్కర్త విద్యాసాగర్ విగ్రహాన్ని కూల్చారని, తాము ఆ విగ్రహ స్థానంలో పంచలోహ విగ్రహం పెడతామని మోడీ అన్నారు. దీనికి మమతా బెనర్జీ ఘాటు కౌంటర్ ఇచ్చింది. నరేంద్ర మోడీ ఓ సైతాన్ అని, అమిత్ షా ఓ గూండా అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన బీజేపీకి ఒక్క బెంగాలీ కూడా ఓటు వేయరని, బీజేపీ ముందు బెంగాల్ మోకరిల్లదని పేర్కొన్నారు.
Next Story
