Thu Jan 29 2026 18:17:55 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీతో పొత్తా…? అది కుదరని పని
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. ఈరోజు జరిగిన కోర్ కమిటీ సమావేశం అనంతరం ఆయన [more]
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. ఈరోజు జరిగిన కోర్ కమిటీ సమావేశం అనంతరం ఆయన [more]

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు. ఈరోజు జరిగిన కోర్ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ తమకు ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నించినా కుదరదని మాధవ్ స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు అన్నదే సాధ్యం కాదని మాధవ్ తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ను వైసీపీ ప్రభుత్వం దివాలా తీయించిందన్నారు. బిల్ ఏపీ పేరుతో ఆస్తులను అమ్మడమే కాకుండా, ఆస్తిపన్నులను అడ్డదారిలో పెంచడం ఏంటని మాధవ్ ప్రశ్నించారు. ఆస్తిపన్ను పెంపుదలపై రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, జనసేనలు ఉద్యమం చేపడతాయని మాధవ్ తెలిపారు.
Next Story