Tue Dec 16 2025 21:41:46 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ మద్దతిచ్చిన ఎమ్మెల్యే భవితవ్యం నేడు
తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన మద్దాలి గిరి ఎన్నికపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. గత ఎన్నికల్లో మద్దాలి గిరి టీడీపీ నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం [more]
తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన మద్దాలి గిరి ఎన్నికపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. గత ఎన్నికల్లో మద్దాలి గిరి టీడీపీ నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం [more]

తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన మద్దాలి గిరి ఎన్నికపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. గత ఎన్నికల్లో మద్దాలి గిరి టీడీపీ నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికలలో ఓటమి పాలయిన వైసీపీ అభ్యర్థి చంద్రగిరి ఏసురత్నం ఈ ఎన్నిక చెల్లదంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మద్దాలి గిరి తప్పుడు అఫడవిట్ సమర్పించారని ఏసురత్నం హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా మద్దాలిగిరి ప్రస్తుతం వైసీపీ మద్దతుదారుగా ఉండటం విశేషం. దీనిపై ఎటువంటి తీర్పు వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story