Sun Mar 22 2026 12:28:50 GMT+0530 (India Standard Time)
వైసీీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నేతల చేరికలు కొనసాగుతున్నాయి. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మాజీ శాసనసభ్యురాలు మద్దాల సునీత జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమె 2004లో కాంగ్రెస్ పార్టీ తరుపున గోపాలపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గంలోని రాజుపాలెంలో జరుగుతున్న ప్రజాసంకల్ప యాత్రకు అనుచరులతో కలిసి వచ్చిన సునీతకు జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమె రాకతో గోపాలపురం నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో వైసీపీకి అదనపు బలం చేకూరే అవకాశం ఉంది.
Next Story

