Sat Mar 21 2026 22:21:05 GMT+0530 (India Standard Time)
రెడ్ స్టార్ ఇక లేరు

ప్రముఖ నటుడు మాదాల రంగారావు మృతి చెందారు. ఆయన గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తెల్లవారుఝామున కన్ను మూశారు. శ్వాసకోస సమస్యతో బాధపడుతున్న మాదాల రంగారావు హైదరాబాద్ లోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విప్లవ నటుడిగా గుర్తింపు పొందిన మాదాల రంగారావు అనేక చిత్రాల్లో నటించడమే కాకుండా నిర్మించారు. ఆయన నటించిన యువతరం కదిలింది సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. కమ్యునిస్టు భావాలున్న మాదాల రంగారావు గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన కుమారుడు మాదాల రవి ప్రస్తుతం సినీ నటుడిగా కొనసాగుతున్నారు.
Next Story

