ఇక లగేజ్ ఎక్కువైతే రైల్లో వాచిపోతుంది

ఇప్పుడు రైల్లో ప్రయాణికులు పరిమితికి మించి లగేజ్ తెచ్చేస్తున్నారు. దీన్ని బ్రేక్ చేయాలిసిన రైల్వే అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. చాలా మంది విమానాల్లో ప్రయాణం చేసే స్థాయి వున్నా రైల్లో అయితే లగేజ్ ఎంతైనా మోసుకుపోవొచ్చని అందులో వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. ఇలా ఎంతైనా లగేజ్ పట్టుకుపోవొచ్చనే ఆలోచన తోటి ప్రయాణికులకు నరకం చూపిస్తుంది. అనేక సందర్భాల్లో లగేజ్ అంశమే చాలా సార్లు ప్రయాణికుల నడుమ ఘర్షణలు సైతం జరిగిపోతున్నాయి. చూసి చూడనట్లు ఇప్పటి దాకా ఈ అంశాన్ని వదిలేసిన రైల్వే ఇక సీరియస్ గా దృష్టి సారించింది.
ఆరురెట్లు జరిమానా
వాస్తవానికి రైల్వే శాఖలో లగేజ్ కి సంబంధించి మూడు దశాబ్దాలక్రితమే నిబంధనలు పొందుపరిచారు. కానీ అమలు మాత్రం జరగడం లేదు. ఆ నిబంధనలు ప్రకారం స్లీపర్ ప్రయాణికులు 45 కేజీ లు ఏసీ ప్రయాణికులు 35 కిలోల బరువు ఒక్కో ప్రయాణికుడు లగేజ్ తెచ్చుకునేందుకు అవకాశం కల్పించారు. అంతకు మించి బరువు వున్న లగేజ్ తెస్తే ప్రయాణించే టికెట్ ధరకు ఆరు రేట్లు జరిమానా విధిస్తారు. ఈ నిబంధనలు కఠినంగా అమలు చేస్తే రైల్వేకు భారీ ఆదాయం సమకూరుతుంది. అంతే కాదు వెల్లువలా రైల్వే శాఖకు వస్తున్న అధిక లగేజ్ ఫిర్యాదులకు చెక్ పెట్టినట్లు అవుతుందని భావిస్తుంది. ఇక పై రైల్వే అధికారులు పై నుంచి వచ్చిన ఆదేశాలను అమలుకు సిద్ధం అవుతున్నారు. సో ప్యాసింజర్లు, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ సూత్రం అమల్లో పెట్టకపోతే ఖర్చు అయిపోతారు జాగర్త.
