Thu Mar 19 2026 11:37:35 GMT+0530 (India Standard Time)
వారికి లోకేష్ వార్నింగ్

సోషల్ మీడియాతో తప్పుడు రాతలు రాస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అయితే, తనపై ఉన్న విమర్శను తుడిచేసుకోవాలని భావిస్తున్నట్లుగా కనపడుతోంది. ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా మంత్రి అయ్యారని తరచూ ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. రానున్న ఎన్నికల్లో ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయానున్నట్లు ప్రకటించారు. పార్టీ ఏ స్థానం నుంచి పోటీ చేయమంటే ఆ స్థానం నుంచి పోటీకి దిగుతానని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతిపై వచ్చే క్యాబినెట్ లో స్పష్టత వస్తుందని ఆయన వివరించారు.
Next Story

