Wed Mar 18 2026 20:47:08 GMT+0530 (India Standard Time)
మోదీపై లోకేష్ ఆసక్తికర ట్వీట్

నరేంద్ర మోదీ పాపులారిటీపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. మోదీ పాపులారిటీ చేసి కొన్ని పార్టీలు ముందస్తు ఎన్నికలకు భయపడుతున్నాయని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కి స్పందించిన నారా లోకేష్ కౌంటర్ వేశారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని, దేశవ్యాప్తంగా వరుసగా ఎదురుదెబ్బలు తింటోందని గుర్తుచేశారు. అందుకే బీజేపీ ముందస్తు ఎన్నికలు అంటోందని, ఇదేనా మోదీ పాపులారిటీ అంటూ ట్విట్టర్ వేదికగా రాంమాధవ్‌ను ప్రశ్నించారు.
Next Story

