Mon Mar 23 2026 20:13:54 GMT+0530 (India Standard Time)
జగన్ పై నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు

హత్యాయత్నానికి గురైన ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నారా లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై ఆయన చేసిన ట్వీట్ లో...‘‘వైకాపా కోడి కత్తి డ్రామా! అధికారం కోసం అడ్డదారులు తొక్కడం జగన్ మోడీ రెడ్డికి కొత్త కాదు. మరోసారి ఓటమి తప్పదు అనే భయంతో కోడి కత్తి డ్రామాకి తెరలేపారు. దాడి వెనుక ఉన్న వైకాపా కుట్ర ప్రజలకు అర్థం అయ్యింది. ఇంకా ప్రజలను మభ్యపెట్టలి అని వైకాపా నేతలు మోసలి కన్నీరు కారుస్తున్నారు.’’ ‘‘తండ్రి చితికి నిప్పు పెట్టకముందే ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన వ్యక్తి ఇలాంటి కత్తి డ్రామా చెయ్యడంలో ఆశ్చరం లేదు. ఎన్ని కుయుక్తులు పన్నినా ఆఖరిగా ప్రజల ముందు గెలిచేది నిజం మాత్రమే’’. అని లోకేష్ పేర్కొన్నారు. జగన్నాటకం పేరుతో ఆయన ఈ ట్వీట్లు చేశారు.
Next Story

