Sat Mar 07 2026 20:08:04 GMT+0530 (India Standard Time)
వద్దంటే వెళ్లావే మంగళగిరికి
టీడీపీ నేత నారా లోకేష్ కు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మధ్య మాటల యుద్ధం ప్రారంభమయింది. ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను సంతలో గొర్రెలను కొనుగోలు చేసినట్లు జగన్ కొనుగోలు [more]
టీడీపీ నేత నారా లోకేష్ కు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మధ్య మాటల యుద్ధం ప్రారంభమయింది. ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను సంతలో గొర్రెలను కొనుగోలు చేసినట్లు జగన్ కొనుగోలు [more]

టీడీపీ నేత నారా లోకేష్ కు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మధ్య మాటల యుద్ధం ప్రారంభమయింది. ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను సంతలో గొర్రెలను కొనుగోలు చేసినట్లు జగన్ కొనుగోలు చేశారని లోకేష్ ఫేస్ బుక్ లో ఆరోపించారు. జగన్ గొర్రెలతో పాటు గొర్రెల డాక్టర్ ను కూడా కొనుగోలు చేశారని లోకేష్ పరోక్షంగా వల్లభనేని వంశీ, జగన్ ఫొటోలను పోస్ట్ చేశారు. దీనిపై వల్లభనేని వంశీ ఘాటుగా స్పందించారు. వద్దంటే మంగళగిరికి వెళ్లి చిత్తుగా ఓడిపోయారని ఎద్దేవా చేశారు. మంగళగిరిలో ఓడిపోవడం, ఎమ్మెల్సీ పదవి ఊడిపోవడంతో లోకేష్ కు పిచ్చిపట్టిందని, తన వద్ద పిచ్చికుక్కలకు కూడా వైద్యం ఉందని వల్లభనేని వంశీ ధీటుగా స్పందించారు.
Next Story