Sun Mar 15 2026 08:19:00 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : రేపటి నుంచే ఏపీలో మద్యం అమ్మకాలు
రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈమేరకు ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ మద్యం [more]
రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈమేరకు ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ మద్యం [more]

రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈమేరకు ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ మద్యం షాపులుంటాయి. అయితే మద్యం కొనుగోలు చేసేటప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. అలాగే మద్యం కొనేవాళ్లు, అమ్మేవాళ్లు తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని రజిత్ భార్గవ్ తెలిపారు. అయితే కంటెన్మయింట్ ఏరియాల్లో మాత్రం మద్యం అమ్మకాలు ఉండవని తెలిపారు. దీంతో ఏపీలో రేపటి నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. బార్లకు మాత్రం ఏపీ వ్యాప్తంగా అనుమతి లేదు.అయితే మద్యం ధరలను భారీగా పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది.
Next Story