Tue Mar 24 2026 00:29:08 GMT+0530 (India Standard Time)
సముద్రంలో కుప్పకూలిన విమానం

ఇండోనేషియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రాజధాని జకర్తా నుంచి సుమంత్రాకు బయలుదేరిన లయన్ ఎయిర్ కు చెందిన విమానం కాసేపటికే కనిపించకుండా పోయింది. 189మంది ప్రయాణికులతో వెళుతున్న జేటీ610 విమానం టేక్ ఆప్ తర్వాత 13 నిమిషాలకు కనిపించకుండా పోయింది. ఈ విమానం జావా ఐల్యాండ్ వద్ద సముద్రంలో కూలిపోయినట్లు గుర్తించారు. విమానానికి చెందిన శఖలాలు, సీట్లు ఈ ఐల్యాండ్ వద్ద తీరానికి కొట్టుకురావడంతో విమానం సముద్రంలో కూలిందని అధికారులు నిర్ధారించి వెంటనే గాలింపు ప్రారంభించారు. 2004లో లయన్ ఎయిర్ కే చెందిన ఓ విమానం కూలిపోగా 25 మంది ప్రయాణికులు మరణించారు.
Next Story

