Wed Mar 18 2026 15:11:38 GMT+0530 (India Standard Time)
రాజకీయ ప్రవేశం లక్ష్మీనారాయణ స్పష్టత

రాజకీయ ప్రవేశంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టత ఇచ్చారు. స్వంతంగా పార్టీ స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఎల్లుండి ఉదయం 9.05 గంటలకు ఆయన హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబీషన్ గ్రౌండ్స్ లో పార్టీని ప్రకటించనున్నారు. ఆయన పార్టీ పేరు ‘జన ధ్వని’గా తెలుస్తోంది. అయితే, లక్ష్మీనారాయణ సీబీఐ జేడీగా పనిచేసినందున తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఆయన ‘జేడీ‘గానే సుపరిచితులు. జన ధ్వని పేరులో ‘జేడీ’ ఉండటం వల్ల కూడా ఆయన ఈ పేరును ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
Next Story

