Fri Mar 20 2026 00:51:27 GMT+0530 (India Standard Time)
మళ్లీ జైలుకు లాలూ

దాణా కుంభకోణంలో జైలు శిక్ష పడిన బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రాంచీలోని సీబీఐ కోర్టు ఎదుట లొంగిపోయారు. లాలూకు గత డిసెంబర్ లో కోర్టు జైలు శిక్ష విధించింది. అయితే, ఆయన అనారోగ్యం రిత్యా ఆయన బెయిల్ పై రాంచీలోని రిమ్స్ లో, ఢిల్లీ ఎయిమ్స్ లో, ముంబాయిలో చికిత్స పొందుతున్నారు. మే 11న లాలూకు జార్ఖాండ్ హైకోర్టు ఆరు వారాల బెయిల్ మంజూరు చేసింది. ఈ గడువు ముగియడంతో ఆయన బెయిల్ గడువు పెంచాలని కోర్టును ఆశ్రయించగా కోర్టు అంగీకరించలేదు. దీంతో ఆయన గురువారం కోర్టు ముందు లొంగిపోయారు.
Next Story

