Mon Mar 23 2026 02:26:36 GMT+0530 (India Standard Time)
లాలూ...కు భలే ఛాన్స్

దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైలు జీవితానికి తాత్కాలిక ఊరట లభించింది. ఆయనకు వైద్య చికిత్సల కోసం ఆరు వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. గత డిసెంబరు 23 నుంచి ఆయన బిర్సాముందా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అనారోగ్య కారణాలతో గత నెల 17న ఆసుప్రతిలో చేరారు. మరిన్ని వైద్యసేవల నిమిత్తం ఆయనకు మూడు నెలల బెయిల్ మంజూరు చేయాలని లాలూ తరుపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. లాలూ ఆరోగ్యంపై ఎయిమ్స్ వైద్యులు ఇచ్చిన నివేదికను పరిశీలించిన కోర్టు ఆయనకు ఆరు వారాలు బెయిల్ ఇచ్చింది. కాగా, ఈ నెల 12న జరగనున్న పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహం కోసం లాలూ ప్రస్తుతం మూడు రోజుల పెరోల్ పై ఉన్నారు.
Next Story

