Mon Mar 23 2026 14:48:36 GMT+0530 (India Standard Time)
ఏపార్టీలో చేరేది లేదు

సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గుంటూరు జిల్లాలో పర్యటించారు. గుంటూరు జిల్లా యాజిలిలో రైతులతో లక్ష్మీనారాయణ సమావేశమయ్యారు. రైతుల సమస్యలను లక్ష్మీనారాయణ తెలుసుకుంటున్నారు. అయితే లక్ష్మీనారాయణ మాత్రం తాను ఏ పార్టీలో చేరనని స్పష్టం చేశారు. లక్ష్మీనారాయణ స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఆమోదం తెలిపిన మరుసటి రోజే లక్ష్మీనారాయణ రైతులతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన తన భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటించనున్నారు.
Next Story

