Wed Mar 18 2026 02:48:24 GMT+0530 (India Standard Time)
బిగ్ బ్రేకింగ్ : సర్వే వివరాలు ప్రకటించిన లగడపాటి

తెలంగాణ ఎన్నికలపై చేసిన సర్వే వివరాలను మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పాక్షికంగా ప్రకటించారు. తెలంగాణలో పార్టీల ప్రలోభాలకు ప్రజలు లొంగడం లేదని, ఇండిపెండెంట్ అభ్యర్థుల హవా ఈ ఎన్నికల్లో ఎక్కువగా ఉండబోతోందని ఆయన స్పష్టం చేశారు. మొత్తం 8 నుంచి 10 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలవబోతున్నారని తెలిపారు. నారాయణపేట, బోథ్ నియోజకవర్గాల్లో స్వతంత్రులు గెలుస్తారని ప్రకటించారు. రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పుల ఫలితాలను ప్రకటిస్తానని ఆయన తెలిపారు. 7వ తేదీ తర్వాత పూర్తి సర్వే ఫలితాలను వెల్లడిస్తానని ఆయన స్పష్టం చేశారు.
Next Story

