Sat Mar 21 2026 09:06:18 GMT+0530 (India Standard Time)
అవి ఉత్తుత్తి సర్వేలంటున్న లగడపాటి

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో లగడపాటి రాజగోపాల్ సర్వే ఏపీలో చేయించారని, ఇందులో ఏపీలో ఒక పార్టీకి అధిక స్థానాలు వస్తాయని, ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందన్న ఒక న్యూస్ వైరల్ అవుతోంది. అయితే తాను కాని, తన సంస్థ కాని ఎటువంటి సర్వేలు చేయించలేదని లగడపాటి వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో తాను సర్వే చేయించినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాను నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాతనే సర్వే చేయిస్తానని, ఒకవేళ సర్వేచేయిస్తే తానే ఆ ఫలితాలను వెల్లడిస్తానని, ఎవరికీ ఇవ్వనని లగడపాటి చెప్పారు. సోషల్ మీడియలో తన పేరిట వచ్చే సర్వే వార్తలను నమ్మవద్దని ఆయన కోరారు.
Next Story

