Sun Mar 15 2026 16:03:02 GMT+0530 (India Standard Time)
లగడపాటి సర్వే అప్పుడే..!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సర్వే ఫలితాలను మే 19న దేశవ్యాప్తంగా చివరి విడత ఎన్నికలు ముగియగానే వెల్లడిస్తానని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. సోమవారం తిరుమల శ్రీవారిని [more]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సర్వే ఫలితాలను మే 19న దేశవ్యాప్తంగా చివరి విడత ఎన్నికలు ముగియగానే వెల్లడిస్తానని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. సోమవారం తిరుమల శ్రీవారిని [more]

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సర్వే ఫలితాలను మే 19న దేశవ్యాప్తంగా చివరి విడత ఎన్నికలు ముగియగానే వెల్లడిస్తానని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేర్కొన్నారు. సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు అనుభవజ్ఞులకే పట్టం కడతారని, రాష్ట్ర భవిష్యత్ కోసం అనుభవజ్ఞుల అవసరం ఉందని పరోక్షంలో చంద్రబాబే గెలవాలని ఆకాంక్షించారు. ఓటేసే ముందు ప్రజలు అభివృద్ధి, సంక్షేమాన్ని చూస్తారని ఆయన పేర్కొన్నారు. ఆయన మాటలు బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీ గెలవాలని ఆయన భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
Next Story