Sat Dec 06 2025 07:50:03 GMT+0000 (Coordinated Universal Time)
మాటకు కట్టుబడి ఉంటా: లగడపాటి
ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, రాజకీయ సన్యాసం తీసుకుంటానని గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. తాను [more]
ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, రాజకీయ సన్యాసం తీసుకుంటానని గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. తాను [more]

ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని, రాజకీయ సన్యాసం తీసుకుంటానని గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. తాను ఎవరికి, ఏ పార్టీలోనూ సీట్లు ఇప్పించే ప్రయత్నం చేయలేదన్నారు. తనకు అన్ని పార్టీల్లో మిత్రులు ఉన్నందున అవసరం అనుకున్న వారికి సూచనలు, సలహాలు మాత్రమే వ్యక్తిగతంగా చెబుతున్నానని అన్నారు. ఈ 30 రోజుల్లో ఎన్నికల్లో నగదు ప్రభావం బట్టే ఎన్నికల ఫలితలాలు ఉంటాయని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత ఏప్రిల్ 11న మాత్రమే సర్వే ఫలితాలు చెబుతానని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా అంశం ప్రజల్లో నాటుకుపోయిందని, ప్రత్యేక హోదా కూడా ఎన్నికల్లో ఒక అంశంగా ఉంటుందన్నారు.
Next Story