Mon Mar 16 2026 07:13:39 GMT+0530 (India Standard Time)
టీడీపీ కి త్వరలో రాజీనామా
తెలుగుదేశం పార్టీకి తాను త్వరలో రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ తెలిపారు. తన అనుచరులు, సన్నిహితుల సూచనల మేరకు ఈ నిర్ణయం [more]
తెలుగుదేశం పార్టీకి తాను త్వరలో రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ తెలిపారు. తన అనుచరులు, సన్నిహితుల సూచనల మేరకు ఈ నిర్ణయం [more]

తెలుగుదేశం పార్టీకి తాను త్వరలో రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ తెలిపారు. తన అనుచరులు, సన్నిహితుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తాను రాజకీయంగా అనేక పదవులు పొందానని తెలిపారు. పది సార్లు తనకు టీడీపీ బీఫారంలు ఇచ్చిందని ఎల్.రమణ తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు వచ్చాయన్నారు. బలహీన వర్గాల నుంచి వచ్చిన తనకు రాజకీయంగా ఎన్నో అవకాశాలు లభించాయని ఎల్.రమణ తెలిపారు. పార్లమెంటు సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసే అవకాశం దక్కిందన్నారు. ఆయన త్వరలో టీఆర్ఎస్ లో చేరబోతున్నారు.
Next Story