Mon Feb 02 2026 09:13:03 GMT+0000 (Coordinated Universal Time)
ప్రత్యేక హోదాపై కేవీపీ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల్లో ప్రత్యేక హోదానే ప్రదాన అజెండాగా ఉండనుందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రారావు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చి తీరుతుందని, ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీనే పోరాడుతుందన్నారు. రాబోయే యూపీఏ ప్రభుత్వం ఏపీకి హోదా ఇస్తుందన్నారు. ఈ విషయాన్ని గతంలో చెబితే తనను అందరూ హేళన చేశారన్నారు. బీజేపీ మొదటి నుంచీ అబద్ధాలు చెబుతుందన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై రాజ్యసభలో మరోసారి ప్రైవేటు బిల్లు పెట్టానని, ఈ బిల్లు రేపు చర్చకు వవస్తుందని ఆయన పేర్కొన్నారు.
Next Story

