Sun Mar 22 2026 12:30:30 GMT+0530 (India Standard Time)
జేడీఎస్ కు గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చిన చంద్రబాబు

కర్ణాటకలో రాజకీయ పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జేడీఎస్ నేత కుమారస్వామికు పలు కీలక సూచనలు చేశారు. కర్ణాటకలో గవర్నర్ నిర్ణయంపై మాట్లాడేందుకు కుమారస్వామి సీఎం చంద్రబాబుకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. 1984లో కూడా తాము ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నామని, 161 మంది ఎమ్మెల్యేలను తీసుకుని కర్ణాటకలోని నంది హిల్స్ కు క్యాంపుకు వచ్చామని, మా నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా చేజారలేదని బాబు చెప్పారు. అప్పుడు మేము కర్ణాటక వచ్చామని, ఇప్పుడు మీరు హైదరాబాద్ వచ్చారన్నారు. కర్ణాటక గవర్నర్ తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామికం అని చంద్రబాబు అన్నారు.
Next Story

